కేవలం దుస్తులకే రూ.3 కోట్లు ఖర్చు పెట్టించిన హీరోయిన్..!!
అయితే తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టైలిష్ అయిన లేపాక్షి ఎల్లవాడని దాదాపుగా ఎనిమిది గంటలపాటు విచారించడం జరిగింది. ఈ సందర్భంగానే జాక్వెలిన్ - సుఖేష్ ఇద్దరూ కూడా సహజీవనం చేశారని లేపాక్షి తెలియజేసినట్లు సమాచారం. అయితే తనకు సుకేష్ ఎన్నోసార్లు ఫోన్ చేసి జాక్వెలిన్ కు ఎలాంటి వస్త్రాలు అంటే ఇష్టం అని ఆమెకు నచ్చిన బహుమతులను తీసుకొని వెళ్లేవారు అని లేపాక్షి తెలిపారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలు బ్రాండెడ్ దుస్తులను కొనిచ్చినట్లుగా సమాచారం. వాటికోసం తన బ్యాంక్ అకౌంట్ కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వారిని తెలిపారు లేపాక్షి. అయితే సుకేష్ అరెస్ట్ తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అతనితో తెగ తెంపులు చేసుకుంది అని తెలిపినట్లు సమాచారం ఇచ్చారు లేపాక్షి.
అయితే సుఖేష్ కుంభకోణంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సంబంధాలు ఉన్నట్లుగా ఈడి తేల్చడం జరిగింది. జాక్వెలిన్ కోసం భారీగా డబ్బును కూడా పోగు చేయడమే కాకుండా సముద్ర తీరాన ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను కూడా ఆమెకి కానుకగా ఇచ్చారని.. సుఖేష్ తో ఆమె గడపడానికి అక్కడికి కూడా వెళుతుందని ఈ డీ అధికారులు వెల్లడించడం జరిగింది. దాదాపుగా సుఖేశ్ నుంచి ఆమె రూ. 20 కోట్ల రూపాయలకు పైగా అన్నిటిని అందుకున్నట్లు సమాచారం.