ఆ సినిమాలో సమంతకు జోడి ఎవరో తెలుసా?

Satvika
తెలుగు సినీ అభిమానులకు సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు..మొదటి సినిమాతో మంచి టాక్ ను అందుకుంది.ఆ తర్వాత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది..ఈ మధ్య కాలంలో సమంత కాస్త దూకుడును పెంచింది.వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ - గుణా టీమ్ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ ను పౌరాణిక ఇతిహాస ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో, సెట్టింగ్స్‌లతో గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమంత శాకుంతల దేవీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ తాజాగా ఈ లో సమంత జోడిగా నటిస్తున్న దుష్యంత మహారాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఆదివారం దేవ్‌ మోహన్‌ పుట్టిన రోజు సందర్భంగా దేవ్‌ మోహన్‌ ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది..గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న యువరాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ ఆకట్టుకుంటున్నారు.షేర్‌ చేసిన నీలిమా గుణ.. 'హ్యాపీ బర్త్ డే టు అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్' అంటూ చిత్రబృందం మోహన్కు విషెస్ చెప్పింది. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ నటిస్తోన్న విషయం తెలిసిందే..ఈ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంటే అల్లు అర్హ కు ఇక ఇండస్ట్రీలో మంచి ఫెమ్ తో పాటు వరుస అవకాశాలు కూడా వస్తాయి..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్ని సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: