సమంత 'శాకుంతలం' మూవీ నుండి రేపు ఆ సమయానికి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నీలిమ గుణ ఈ మూవీ ని నిర్మించింది. ఈ మూవీ లో మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే సమంత కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లకు ప్రేక్షకులు నుండి మంచి ఆదరణ లభిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా శాకుంతలం మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి రేపు ఉదయం 10 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఆ బిగ్ అప్డేట్ దేని గురించి అయి ఉండవచ్చు అనేది తెలియాలి అంటే రేపు ఉదయం 10 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ,  సమంత ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా ,  శేఖర్ వి జోసెఫ్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: