రాజేష్, సుజాత పెళ్లి విషయంలో హస్తం ఉన్న ఆ .... స్టార్ ' రోజా '...!!

murali krishna
టీవీ షోలలో కూడా లవ్ స్టోరీస్ రన్ అవుతున్నట్టు ప్రొజెక్ట్ చేసి టి.ఆర్.పి లు పెంచుకోవడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. బాలీవుడ్ జనాలను చూసే మనవాళ్ళు ఇది నేర్చుకున్నారు.
బుల్లితెర పై ప్రేమ, పెళ్లి వార్తలతో ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది మొదట యాంకర్ రవి- యాంకర్ లాస్య అనే చెప్పాలి. వాళ్ళ గురించి ఎన్ని రూమర్స్ వచ్చాయో అందరికీ తెలుసు. అటు తర్వాత సుడిగాలి సుధీర్ - యాంకర్ రష్మీ లను చెప్పుకోవాలి.
సుధీర్ అంత పాపులర్ అవ్వడానికి కారణం రష్మీతో లింకప్ అయ్యి రన్ అయిన రూమర్స్ అనే చెప్పాలి. ఇది నిజమే అన్నట్టు ఛానల్ వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసి టి.ఆర్.పి పెంచుకున్నారు. అయితే వీళ్ళు ఇప్పటివరకు పెళ్లి చేసుకుంది లేదు. సరే వీళ్ళని పక్కన పెట్టేస్తే.. కొద్దిరోజులుగా రాకింగ్‌ రాకేష్‌-జోర్దార్‌ సుజాత జంట కూడా హాట్ టాపిక్ అవుతుంది.వీళ్ళు కూడా మొదట రీల్‌ కపుల్‌ అని అంతా అనుకున్నారు.
కానీ ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. అదే టైంలో స్టేజి పై రింగ్‌ తొడిగి మరీ ప్రపోజ్ చేశాడు రాకేష్. వీరు నిజంగా ప్రేమలో ఉన్నారని ఆ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ.. 'మా ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా తెలియజేయడానికి కారణం రోజా గారు.
మా మధ్య ప్రేమకు కారణం కూడా ఆమెనే. ఈ విషయాన్ని ముందుగా గుర్తించింది రోజా గారే. ఆమె ప్రోత్సాహం వల్లే తమ ప్రేమ, పెళ్లి గురించి ఇంత రివీల్ చేయడం జరిగింది. త్వరలోనే మా పెళ్లి డేట్ కూడా ప్రకటిస్తాము' అంటూ రోజా హోమ్ టూర్ వీడియోలో సుజాత చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: