సమంత శాకుంతలం విడుదల అప్పుడేనా...!!

murali krishna
సమంత ప్రధాన పాత్రలో నటించిన దర్శకుడు గుణశేఖర్, దిల్ రాజు కలిసి రూపొందించిన సినిమా 'శాకుంతలం'. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.


భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఇందు లో టాలీవుడ్ నటీనటుల తో పాటు ఇతర భాషల కు చెందిన తారలు కూడా ఉన్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.


సంక్రాంతి కి సినిమా విడుదలవుతుంద నే ప్రచారం జరిగింది. కానీ అదే సమయంలో చాలా పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. వాటిలో దిల్ రాజు 'వారసుడు' సినిమా కూడా ఉంది. కాబట్టి అప్పటికి సినిమాను రిలీజ్ చేయలేరు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ తొలివారంలో లేదా.. నవంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా కొన్ని సినిమాలు పోటీకి కూడా ఉన్నాయి.


ధనుష్ 'సార్', నాని ప్రొడ్యూస్ చేస్తున్న 'హిట్ 2' సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీటికంటే ముందు లేదా.. తరువాత 'శాకుంతలం' సినిమా రానుందట. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉంది. ఆమె రాగానే రిలీజ్ డేట్ గురించి డిస్కస్ చేసి.. అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారట.. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. మరి చూడాలి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: