రాజమౌళి... మహేష్ బాబు కాంబినేషన్ మూవీ బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ,  సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అధికారికం గా ధ్రువీకరించారు . వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే  మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి అయినటు వంటి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించబోతున్నాడు. రాజమౌళి ,  మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ఆఫ్రికా అడవుల నేపథ్యం లో సాగే కథ తో తేరకేక్కబో తున్నట్లు తెలుస్తోంది . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి న ఒక క్రేజీ న్యూస్ నెటింటా వైరల్ అవుతుంది . రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ కోసం అదిరిపోయే రేంజ్ బడ్జెట్ ని నిర్మాతలు కేటాయించినట్లు తెలుస్తోంది . ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ని నిర్మాతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇలా భారీ బడ్జెట్ తో రాజమౌ ళి ,  మహేష్ బాబు మూవీ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 29 వ మూవీ గా తెరకెక్కబోతుంది.  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ,  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: