బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితమే. అంతేకాదు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అమితాబ్ బచ్చన్ . ఈయన ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్.ఇకబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.అయితే పాన్ ఇండియా లెవెల్ లి విడుదలైన ఈ సినిమా
అన్ని భాషల్లో మంచి సక్సెస్‌ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాదు అలాగే మరోవైపు వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్న చిత్రం గుడ్‌బై సినిమాలోనూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమితాబ్ బచ్చన్ కు కూతురిగా నటిస్తోంది. తాజాగాబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇక అదేమిటంటే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలో ఒక ఖరీదైన ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ముంబై నగరంలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతం లోని పార్థినాన్ సోసైటీ లో ఈ స్థిరాస్తిని కోనుగోలు చేసినట్లుగా సమాచారం.
కాగా బహుళ అంతస్తుల భవనంలోని 31వ ఫ్లోర్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఖరీదెంత అన్న విషయం మాత్రం బయటికి రాలేదు.అయితే ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న విషయం తెలిసిందే..!!