ఈ ఫొటోలో వున్న అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్?

Purushottham Vinay
ఇక పైన కనిపిస్తున్న ఫోటోలో ఓర కళ్లతో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టండి. ఇప్పుడు ఈ క్యూట్ అమ్మాయి ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.ఇక అంతేకాదు.. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటుంది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ సైతం పెంచేసింది. ఎవరో గుర్తుపట్టండి. వాస్తవానికి ఈ చిన్నారి.. నార్త్ హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెండితెరపై తన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసింది.అయితే ఆ చిన్నారి మరెవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత బీటౌన్ లో పలు చిత్రాల్లో నటించింది. సూరియా, లవ్ సోనియా, సూపర్ 30, గోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా , జెర్సీ వంటి హిట్ ల్లో నటింటి మెప్పించింది.


ఇక ఇటీవల తెలుగు డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రతో దక్షిణాది ప్రేక్షకుల మనసులను దోచుకుంది.తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఏ సినిమాతో రాని గుర్తింపు ఈ బ్యూటీకి కేవలం ఈ ఒక్క తెలుగు సినిమాతో వచ్చింది. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఈ సినిమా హిట్ తో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ లో మృణాల్ సెలెక్ట్ అయినట్లుగా సమాచారం తెలుస్తుంది.మరి చూడాలి ఓవర్ నైట్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఈ హాట్ బ్యూటీ ఫ్యూచర్ లో పెద్ద బిజీ స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: