టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ కి రీమేక్ ఈ గాడ్ ఫాదర్. ఇక ఆ సినిమా నుంచి తాజాగా మేకర్స్ 'థార్ మార్ థక్కర్ మార్' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంకా అలాగే మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబోలో వచ్చే ఈ పాట చాలా స్టైలిష్‌గా సాగుతూ సూపర్ గా ఉంది. ఇక థియేటర్లలో జనాలు ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని తెలిసిపోతుంది.
ఇప్పటికే గాడ్ ఫాదర్ నుంచి 'థార్ మార్ థక్కర్ మార్' ప్రోమో విడుదలవగా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా మేకర్స్ 'థార్ మార్ థక్కర్ మార్' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు. పాట విషయానికి అదిరిపోయే మ్యూజిక్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట తమన్ ఖాతాలో ఖచ్చితంగా మరో చార్ట్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం.
సల్మాన్, చిరంజీవి క్రేజీ కాంబోలో వచ్చే ఈ పాట స్టైలిష్‌గా సాగుతూ..థియేటర్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని తెలిసిపోతుంది.ఈ పాటకు ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చాడు.అలాగే తెలుగులో స్టార్ లిరిసిస్ట్ గా దూసుకుపోతున్న అనంతశ్రీరామ్ ఈ సాంగ్‌ను రాయగా..శ్రేయో ఘోషల్ పాడింది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీ రోల్లో నటిస్తున్నాడు.ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.