ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బన్నీ కూతురి క్యూట్ వీడియో?

Purushottham Vinay
 టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 కోసం వర్కౌట్స్ చేయడంతో పాటు స్క్రిప్ట్ వర్క్ లో కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నాడు.అతి త్వరలోనే సినిమా  షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన కూతురు అర్హ తో కలిసి రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాడు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల గారాల కుమార్తె అల్లు అర్హ ఎంత క్యూట్ గా ఉంటుందో అంతే క్యూట్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాప  పలుకులు చిలక పలుకులు అన్నట్లుగా ఉంటాయి అంటూ బన్నీ అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు.తాజాగా అల్లు అర్హ  బన్నీల వీడియో వైరల్ అవుతోంది. అందులో అర్హ క్యూట్ గా తెలుగు పద్యం చెప్పడం మాత్రమే కాకుండా చాలా క్యూట్ గా తండ్రితో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వుంది అర్హ.


ఇలాంటి క్యూట్ వీడియోలతో అర్హ తన తండ్రి కన్నా మరింత పాపులర్ అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.తండ్రి అల్లు అర్జున్ తో ఏడు నల్ల లారీలు.. ఏడు తెల్ల లారీలు అని ఫాస్ట్ గా అనమంటూ తండ్రికి సవాల్ విసిరింది.అల్లు అర్జున్ ఆ మాటను మొదటి అటెమ్ట్ లోనే తప్పుగా పలకడంతో అర్హ మరింత క్యూట్ గా నవ్వడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఉంటారో అనేందుకు అర్హ ప్రత్యక్ష సాక్ష్యం. గతంలో సూపర్ స్టార్ మహేష్ సీతూపాప లాగా ఇప్పుడు అర్హ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరిద్దరు కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అడుగు పెట్టాలని ఆ హీరో అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: