కమెడియన్ ఆర్టిస్ట్.. 'విద్యుల్లేఖ' బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.....!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా పేరు పొందిన విద్యుల్లేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరియర్ మొదట్లో నాటకాల్లో , థియేటర్ ఆర్టిస్టుగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.
ఈమె చూడటానికి ఎంతో బొద్దుగా ముద్దుగా ఉండేది. కానీ ఈమె ఒకేసారి సన్నబడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా ఈ మధ్యనే పెళ్లి చేసుకుని పెళ్లి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది.
ఇక ఈమె నటించిన సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 2012లో ఎటో వెళ్లిపోయింది.. మనసు సినిమా మొట్టమొదటగా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే ఏడాది తమిళ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ఇక పలు సినిమాలలో నటించి తను చేసే పాత్రకు మంచి గుర్తింపును తెచ్చుకుంది. సరైనోడు సినిమాలో తమిళ అమ్మాయిగా చేసి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఆ తర్వాత రన్ రాజా రన్ , రాజుగారిగది వంటి మంచి హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె ఫిట్నెస్ న్యూట్రీషన్ నిపుణుడు సంజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తను చాలా యాక్టివ్ గా మారిపోయింది. అంతేకాకుండా తన భర్తతో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది.
పైగా విద్యుల్లేఖ సన్నబడడంతో… పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కెమెరా ముందు తన అందాలను వోలకపోస్తోంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తను తండ్రి గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. ఈమె తండ్రి ఒక మంచి నటుడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఇంతకు ఆయన ఎవరంటే తమిళ సినిమా నటుడు, జర్న లిస్ట్ మోహన్ రామన్ .ఈయన నటుడే కానీ రచయితగా కూడా పనిచేశాడు. ఈయన 1991లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. మోహన్ రామన్ ది హిందూ పత్రికకు చలనచిత్ర వ్యాసాలను అందిస్తుంటాడు. ఇక ఈయన కూడా టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించాడు. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశాడు. ఇక తమిళంలో అయితే సీరియల్స్ లో కూడా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: