సుపర్ స్టార్ ఇంటి నుండి కొత్తగా రాబోతున్న.... ' హీరో '.... శరన్....!!

murali krishna
గత కొద్ది రోజులుగా సినిమావాళ్లలో చర్చగా నిలవటమే కాకుండా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన చిత్రం మిస్టర్ కింగ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, పాట, టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి.
మిస్టర్ కింగ్ సినిమా టీజర్ ను కేవలం వారం రోజుల్లో 40 లక్షల మంది వీక్షించారు. అంతకు ముందు వినని సినిమా ఒక్క సారిగా బజ్ తెచ్చుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ...ఈ సినిమా హీరోగా చేసిన శరణ్ కుమార్ ఎవరు,కొత్తవాడైనా మంచి ఈజ్ తో చేసాడని సర్వత్రా వినపడుతోంది. ఈ క్రమంలో ఈ విషయం తెలియచేయటానికి టీమ్ ఓ వీడియో వదిలింది.
సూపర్ స్టార్ కృష్ణగారు ఈ వీడియోలో చరణ్ తమ కుటుంబానికి చెందిన విషయం రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే సహజనటి జయసుధగారు, సీనియర్ నటుడు నరేష్ గారు, హీరో సుధీర్ బాబు ..సినిమా విజయం సాధించాలని విషెష్ తెలిపారు. ఇక ఈ చిత్రం ద్వార కృష్ణ గారి కుటుంబం నుండి 8 వ హీరో గ పరిచయమవుతున్నారు శరణ్ కుమార్.
చిత్ర హీరో శరణ్ మాట్లాడుతూ... తను హీరో అవటానికి మహేష్ బాబుగారు ప్రేరణ అని చెప్పారు. నటుడుగా నిలదొక్కాలంటే స్ట్రగుల్ ఉండాలని, అప్పుడే అది ఆర్ట్ ఫామ్ లో కనిపిస్తుందని నమ్ముతానని, ఆ స్ట్రగుల్ తాను పడ్డానని శరణ్ కుమార్ అన్నారు.ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో నా పాత్ర పేరు శివ. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా. మణిశర్మగారు చక్కటి బాణీలు సమకూర్చారని తెలిపారు.
'హూ ఈస్ శరన్ కుమార్' అనే వీడియోను సూపర్ కృష్ణ మరియు మహేష్ బాబు ఫాన్స్ ఘనంగా రిలీజ్ చేశారు. నానక్ రామ్ గూడా లోని హీరో శరణ్ కుమార్ నివాసం వద్ద గెట్ టు దెగర్ కార్యక్రమంలో వారంతా కలిసారు. జిల్లాల వారిగా వచ్చిన అభిమానులకు ... శరణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు . పలు విషయాలు చర్చించారు. సూపర్ స్టార్ తో తమ అనుభంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ కుటుంబం వస్తున్న మరో హీరోకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం మొత్తం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో తండ్రి రాజ్ కుమార్, డైరెక్టర్, శశిధర్ చావలి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ చావలి పాల్గొన్నారు. అలాగే కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ జాతీయ అధ్యక్ష్యుడు మహ్మద్ ఖాదర్ ఘోరి, దొడ్డి రాంబాబు, జంగయ్య గౌడ్ ఇంకా మిగతా అభిమానులు పాల్గొన్నారు.
ఈ మిస్టర్ కింగ్ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: