ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మూవీ లో 'ప్రియాంక అరుల్ మోహన్' అధికారిక ప్రకటన వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు ఆయన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ధనుష్ తెలుగు లో కూడా తాను నటించిన మూవీ లను డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించు కున్నాడు. తెలుగు లో ధనుష్ హీరోగా తెరకెక్కిన రఘువరన్ బీటెక్ , మారి , తిరు మూవీ లు మంచి విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు లో సార్ అనే టైటిల్ తో తెరకెక్కుతూ ఉండగా ,  తమిళ్ లో ఈ మూవీ వెట్టి అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.

ఈ మూవీ తో పాటు ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నారు. అరుణ్ మధేశ్వరన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కెప్టెన్ మిల్లర్ మూవీ లో టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ కూడా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ప్రియాంక అరుణ్ మోహన్ ఇప్పటికే ఈ సంవత్సరం డాన్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని మంచి జోష్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: