గంగుబాయ్ గా మారిన మెగా డాటర్.. నెట్టింట్లో వీడియో వైరల్..!!

Anilkumar
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ కూతురు..అంతేకాదు  రణబీర్ కపూర్ భార్య అలియా భట్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం గంగూభాయ్ కతియావాడి.ఇకపోతే ఈ సినిమాలో అలియా భట్ చాలా లీనమైపోయినటించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఇక  ఈ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు కూడా లభించింది. కాగా గంగూభాయ్ పాత్రను ఇమిటేట్ చేస్తూ ఇటీవల అదే స్టైల్ ను అనుసరించింది మెగా డాటర్ నిహారిక కొనిదెలా.. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఛాలెంజ్ గా తీసుకున్నాను.. 

ఎలా ఉంది …నాకు ఈ గెటప్ చాలా నచ్చింది అంటూ రాసుకుంది.  గంగూభాయ్ గెటప్ లో  మెగా డాటర్ నిహారిక కొనిదెలా  చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు . ఆ కట్టు బొట్టు అన్నీ కూడా గంగూ భాయ్ ను తలపిస్తున్నాయి.అయితే  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.ఇదిలావుంటే నిహారిక పలు టీవీ చానల్స్ లో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె, ఆ తర్వాత హీరోయిన్ గా అవతారం ఎత్తింది.  ఈమె నటించిన రెండు మూడు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. 

ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది ఇక ఇటీవలే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది నిహారిక. అయితే ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇక నిహారిక తన భర్తతో కలిసి రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.కాగా మెగా ఫ్యామిలీకి గారాల పట్టి అయిన నిహారిక విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక కుటుంబంలో నిహారిక అంటే అందరికీ ఎనలేని ఇష్టం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: