ఆ క్రేజీ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన సందీప్ కిషన్..!

Pulgam Srinivas
కమర్షియల్ మూవీ లలో మాత్రమే కాకుండా ఎప్పటి కప్పుడు నటన కు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన మూవీ లలో నటిస్తూ తనకంటూ నటుడి గా ఒక ప్రత్యేక స్థానాన్ని కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న వైవిధ్యమైన నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ధనుష్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగు తున్నాడు.

తను నటించిన ఇతర భాష మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను ధనుష్ దక్కించుకున్నాడు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో తాజాగా తిరు మూవీ తో కూడా మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కి అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సందీప్ కిషన్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది అని , నాకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్ తో కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది అని '  ఈ మూవీ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని సోషల్ మీడియా వేదికగా సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: