ధనుష్ 'సార్' మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీవ్లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా  సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే తాను నటించిన అనేక భాషల సినిమా లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ 'తిరు' అనే మూవీ తో కూడా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు  ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందుతుంది. తెలుగు లో ఈ మూవీ సార్ అనే టైటిల్ తో తేరకెక్కుతూ ఉండగా ,  తమిళ్ లో ఈ మూవీ వెత్తి అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ మూవీ పై అంచనాలను పెంచే విధంగా చేశాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సార్ మూవీ నుండి ఒక అదిరి పోయే అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా సార్ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని 2 డిసెంబర్ 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తిరు మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ధనుష్ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: