'టైగర్ నాగేశ్వరరావు ' లో కీలక పాత్ర పోషిస్తున్న... 'రేణు..'!!

murali krishna
మాస్ మహారాజ రవితేజ నటించిన లు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. దాంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
దాంతో ఇప్పుడు రాబోయే లపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుస లను లైనప్ చేశాడు రవితేజవాటిలో టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ఒకటి. రవితేజ నటిస్తోన్న మొట్టమొదటి పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి కు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించాలని ఆశిద్దాం.1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ ను రూపొందిస్తున్నారు.
ఈ లో కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు.పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు. ఈ లో కీలక పాత్రలో నటి రేణు దేశాయ్ నటించనున్నారు. తాజాగా ఈ విషయాన్నీ కన్ఫామ్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ లో రేణు దేశాయ్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మొన్నామధ్య రిలీజ్ అయిన ఈ టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: