తనక్కూడా అవార్డు రావాలని దేవుని కోరుకుంటున్న స్టార్ హీరోయిన్..!!

Divya
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బబ్లీ బౌన్సర్ అనే సినిమాలో ఈమె నటిస్తోంది.ఈ చిత్రానికి డైరెక్టర్ గా.. జాతీయ అవార్డు విన్నర్ అయిన డైరెక్టర్ మధుర్ బండార్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా ఇదివరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.. ఇక అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది.

బబ్లీ బాన్సర్ సినిమా థియేటర్ రిలీజ్ ని  వదిలేసి మరి డైరెక్ట్ గా ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 23న గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతున్నది ఈ నేపథ్యంలోని చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ మధుర్ బండార్కర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో తనకు చాలా మెమోరీస్ ఉన్నాయని తన మొదటి సినిమా చాందిని బార్ హైదరాబాదులోని తీయడం జరిగింది అని తెలిపారు. ఇక గాయం, అంతం ,గోవింద గోవింద తదితర సినిమాలకు కూడా వర్క్ చేశానని తెలిపారు.

మళ్లీ 23 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బబ్లీ బౌన్సర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకి సంబంధించి సౌత్ లో ఉండకపోవచ్చు కానీ నార్త్ లో లేడి బౌన్సర్  సార్లను చూశాను. వారిని ఇన్స్పైర్  ఆధారంగానే ఈ సినిమాని మొదలు పెట్టానని తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్ ని బబ్లీగా ఫిజికల్ గా మెంటల్గా చాలా మెచ్యూరిటీగా చూపించాలి ఈ విషయంలో మాత్రం తమన్నా బెస్ట్ అని తెలిపారు. ఇక తమన్నా కూడా ఆయన డైరెక్షన్లో వచ్చిన హీరోయిన్ అందరికీ అవార్డులు వచ్చాయి నాకు కూడా ఈ చిత్రానికి అవార్డు రావాలని దేవుని కోరుకుంటున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: