బిగ్ బాస్ 6 నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

Satvika
బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో..ఈ షో ఇప్పటికే ఐదు సీజన్ లను పూర్తి చేసుకుంది..కామెంట్లు, రుమెర్స్ ఎన్ని వచ్చినా కూడా షో మాత్రం సక్సెస్ టాక్ ను అందుకుంది.ఈ షో లో వచ్చిన వారంతా ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు.కాగా,సీజన్ 6 ఇటీవలే మొదలైంది.రెండు వారాలు పూర్తి కావొస్తుంది..ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ జరగనుంది.మూడో వారానికి చేరుకోబోతున కంటెస్టెంట్స్, నిన్నటి ఎపిసోడ్ ని నవ్వుతు, నవ్విస్తూ ముగించారు.

నిన్న కెప్టెన్సీ ఎన్నిక ఉండటంతో కంటెస్టెంట్స్ మూడోవారంకు గాను రాజశేఖర్ ని కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఆ తరువాత బిగ్‌బాస్‌ హౌస్ లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్‌బాబు, కృతిశెట్టి వచ్చి కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశారు..మొదటివారం ఎలిమినేషన్ తీసేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఉతకంఠగా ఉంది. ఈ వారం ఎలిమినేషన్స్ కి రాజ్, షాని, అభినయ, రోహిత్ -మెరీనా, ఆది రెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు బయటకి వస్తారో అన్న విషయంపై ఆడియన్స్ ఎవరి ఊహాగానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు..

ఇకపోతే రెండో వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లే వారిపై షాని సోలమన్” అని తెలుస్తుంది. బిగ్ బాస్ సన్నిహిత వర్గాల నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, రెండవ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి షాని సోలమన్ అని వినిపిస్తుంది. ‘సై’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు షాని పెర్ఫార్మన్స్ బిగ్‌బాస్‌ లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మరి చూడాలి బయటకి వచ్చేది షానినా? లేక ఇంకెవరైనా ఉన్నారా అని..ఏది ఏమైనా బిగ్ బాస్ 6 ముందు సీజన్ లతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని బయట టాక్ వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: