మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా బ్రహ్మోత్సవం , స్పైడర్ లాంటి వరుస అపజయాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో తిరిగి మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నుండి వరుసగా మహర్షి , సరిలేరు నీకెవ్వరు ,  ఈ సంవత్సరం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ లతో వరుస విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకు పోతున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నట్లు తెలుస్తుంది. పూజ హెగ్డే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ భారీ బడ్జెట్ క్రేజీ మూవీ షూటింగ్ మూడు రోజుల క్రితమే అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. 

మూడు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ని జరుపుకున్న ఈ మూవీ రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ని జరుపుకొ నున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేక సెట్ ని కూడా నిర్మించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: