హాట్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇషా రెబ్బ....!!

murali krishna
గ్లామర్ తో ఎరవేస్తుంది తెలుగు భామ అయిన ఈషా రెబ్బా. ఎప్పటికైనా తనలోని హాట్ యాంగిల్ గుర్తించాలని కోరుకుంటుందట. అందుకే హద్దులు కూడా దాటేసి అందాల ప్రదర్శన చేస్తుంది


సోషల్ మీడియా వేదికగా టెంప్టింగ్ ఫోజులతో తెగ టెంపరేచర్ పెంచేస్తుంది. ఇంత చేస్తున్నా ఈషా కోరుకున్న ఆఫర్స్, గుర్తింపు అయితే రావడం లేదు. సొంతింటి అమ్మాయిని టాలీవుడ్ పట్టించుకోవడం లేదు.


శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఈషా రెబ్బా వెండితెరకు పరిచయం అయ్యారు. సెకండ్ మూవీ 'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంలో సోలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. వరుసగా అమీ తుమీ. బ్రాండ్ బాబు, దర్శకుడు చిత్రాల్లో ఈషా హీరోయిన్ గా నటించారు. ఇవన్నీ చిన్న చిత్రాలు కావడంతో ఆమెకు పెద్దగా ఫేమ్ అయితే రాలేదు.


ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఆ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యత లేని రోల్ చేసిన ఈషా రెబ్బా… ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు తీరని అన్యాయం చేసాడు.. హీరోయిన్ పూజా హెగ్డే చెల్లి పాత్రలో రెండు మూడు సీన్స్ లో మాత్రమే ఈషా కనిపించారు. నిజానికి ఆ సినిమాలో ఈషాను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనంతరం సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో చిత్రాల్లో మరలా హీరోయిన్ గా నటించారు.


ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చే ఒక్క మూవీ కూడా తగల్లేదు. చివరిగా ఈషా కనిపించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ మూవీలో కూడా ఆమెది చిన్న వ్యాంప్ రోల్. హీరోకి పెళ్లి చూపుల్లో తగిలే అమ్మాయి పాత్ర చేసింది. ఎన్నాళ్లు ఎదురుచూసినా పెద్ద సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు, ఉపయోగపడని చిన్న చిత్రాల్లో హీరోయిన్ ఛాన్సులు అయితే దక్కుతున్నాయి. దీంతో ఈషా ఇతర పరిశ్రమలపై కన్నేసింది.


ఆమె మలయాళంలో ఒట్టు టైటిల్ తో మూవీ చేశారు. ఇది సెప్టెంబర్ 8న విడుదలైందట . అలాగే తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఓ చిత్రం కూడా చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలీవుడ్ లో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి లాంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అలాగే ఈషా రెబ్బా కూడా కోలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు లేవని కొట్టిపారేయలేం. ఈషా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: