రొమాంటిక్ సీన్.. కంట్రోల్ తప్పి.. హీరోయిన్ ను అక్కడ కొరికిన నాగార్జున?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులందరికీ  కూడా నవమన్మధుడు గా మారిపోయాడు నాగార్జున. నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా ప్రస్తుతం సినిమాల్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అయినప్పటికీ 60 ఏళ్ల వయసులో నాగార్జున ఇంకా కొడుకులకు పోటీ ఇస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. నాగార్జునకు ప్రస్తుతం 60 ఏళ్ల వయసు అయినప్పటికీ అయన అందం మాత్రం 30 ఏళ్ల దగ్గరే ఆగిపోయింది ఏమో అని అనిపిస్తూ ఉంటుంది.

 ఇప్పటికీ అమ్మాయిలలో నాగార్జున కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక నాగార్జున కాస్త రొమాంటిక్ అన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది అన్న విషయం తెలిసిందే.  అయితే నాగార్జున ఒకానొక సమయంలో రొమాంటిక్ సీన్ చేస్తున్న సమయంలో ఒక హీరోయిన్ మెడపైన కొరికాడట. నాగార్జున టబు జంటగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఈ సినిమా లో హీరో హీరోయిన్ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి పోయిందా అని ఒక కొండ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటే.. అదే సమయం లో రొమాన్స్ లో మునిగి పోతారు. ఈ సమయం లో నాగార్జున కాస్త కంట్రోల్ తప్పి టబు మెడపై కొరికాడట .  ఇది గమనించిన కృష్ణ వంశీ కట్ చెప్పేసాడు. అయితే ఆ తర్వాత మాత్రం నాగార్జున అలా చేసినందుకు టబు కి సారీ చెప్పాడట. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. నాగార్జున టబు కాంబినేషన్ లో ఎన్నో సూపర్హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: