ఈ టీవీ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన సమీర్...!!

murali krishna
బుల్లితెర మీద బిజీగా ఉన్న నటుడికి సినిమాల వైపు చూడాల్సి వచ్చింది . ఆయన ఎవరో కాదు సమీర్.. మొట్టమొదటగా తన కెరీర్ ని బుల్లితెర మీద మొదలుపెట్టి వెండితెర మీద క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సమీర్.
కానీ సమీర్ ని ఒక ఛానల్ వాళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇలాంటి విషయాలపై ఇటీవల సమీర్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఒకప్పుడు సమీర్ ఈటీవీలో ప్రసారం అయ్యే ఎన్నో సీరియల్స్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే . దాదాపుగా నెల మొత్తం ఈటీవీ సీరియల్స్ లోనే బిజీగా ఉండేవాడు. శాంతి నివాస్ వంటి సీరియల్ లో నటించి ఇంకొన్ని సీరియల్ లో నటించడానికి అవకాశాలు కూడా వచ్చాయి.
 
అలాంటి టైంలో ఒక కో ఆర్టిస్టుతో చనువుగా ఉండి ఆ అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని ఈటీవీ వారు ఆయనను బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఈటీవీలో వచ్చే ఏ ప్రోగ్రాంలో కూడా ఆయన నటించకుండా బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో సమీర్ పేరు పెట్టారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ సమీర్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు విని సుమన్ గారు నన్ను బ్యాన్ చేశారు. నన్ను ఒక్కసారి పిలిచి నీ గురించి ఇలా ఫిర్యాదు వస్తోంది. అని నన్ని అడిగింటే బాగుండేది. కానీ ఆయన ఏమాత్రం నన్ను విచారించకుండా సడన్ గా నేను చేస్తున్న సీరియల్ ఆపేశారు. ఇక నన్ను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
 
మొత్తం ఈటీవీలోనే సీరియల్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇలా జరగటంతో కట్టాల్సిన లోన్లు అన్ని అలాగే ఉండిపోయాయి. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. నెలకి వచ్చే ఆదాయము పోయింది.. కట్టాల్సిన బాకీలు అలాగే ఉన్నాయి .. నాకు ఏం చేయాలో తోచలేదు. ఇక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పి ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకే సన్నిహితుడైన ప్రభాకర్ కి కూడా ఏమి చెప్పలేదు. ఇక కొన్నేళ్లు గడిచిన తర్వాత మళ్లీ సుమన్ గారే మాట్లాడారు. అప్పుడు నీపై తప్పుడు మాటలను విన్నాను అంటూ చెప్పారు. ఇక ఆ సంఘటన జరిగిపోయిన తరువాత సినిమాల్లోకి వచ్చాను. ఖాళీగా ఉండలేక ఆ టైంలో ఏం చేయాలో తోచలేక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అంటూ సమీర్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: