ఏం మాయ చేసావే-2 సినిమా రాబోతోందా.. నటీనటులు..?

Divya
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఎప్పుడూ తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంటారు. తెలుగులో ఘర్షణ, ఏం మాయ చేసావే వంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ ఒకపక్క సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక ఆయన సినిమాలకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వాసుదేవ్ మీనన్ తెరకెక్కించే లవ్ స్టోరీస్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తూ ఉంటాయి.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం హీరో శింబు తో ముత్తు సినిమాని తెరకెక్కించారు.  ఈ సినిమా తమిళంలో రెండు రోజుల క్రితం విడుదలైంది తెలుగులో 17వ తేదీన ఈ నెల విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడడం జరిగింది. తన సినిమాలలో కొన్నిటికీ మాత్రం పార్ట్-2 చేయాలని ఉందని తెలియజేశారు. అందులో కమలహాసన్ తో చేసిన రాఘవన్ చిత్రానికి రాఘవన్-2 ప్లాన్ చేయాలనుకుంటున్నాను. అలాగే వెంకటేష్ తో కలిసి తీసిన ఘర్షణ సినిమాకి , నాగచైతన్యతో కలిసి  తెరకెక్కించిన ఏం మాయ చేసావే వంటి సినిమాలకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తానని భవిష్యత్తులో అంటూ  తెలియజేశారు.
అయితే గతంలో ఈ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్స్ ని తెరకెక్కిస్తానని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంలో ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్య, సమంత నటించారు. ఇక అక్కడి నుంచి వారిద్దరి ప్రేమ మొదలైందని చెప్పవచ్చు.  అలా వీరిద్దరికి తొలి హిట్ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడం జరిగింది. అయితే డైరెక్టర్ వాసుదేవ్ మీనన్ నాగచైతన్యతో ఏం మాయ చేసావే 2 తీస్తాను అని చెప్పడంతో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనే విషయం ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నగా మారింది. మరి సమంత ను,  చైతన్యాన్ని ఒకటిగా చూపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: