కిరణ్ అబ్బవరం ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

Divya
సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన యువ హీరో కిరణ్ అబ్బవరం ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా డైరెక్టర్ కార్తీక్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఆనే చిత్రంలో నటించారు. కిరణ్ అబ్బవరం నటించిన గత రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. మరి ఈ సినిమాతో నైనా విజయాన్ని అందుకున్నాడో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నేను మీకు కావాల్సిన వాడిని సినిమాలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ , సిద్ధార్థ మీనన్ నటించారు. ఇక ఈ సినిమాకి కోడి దివ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కోడి దివ్య దీప్తి నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి ,బాబా భాస్కర్, సమీర్ నటించారు. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే .. ఇందులో కిరణ్ అబ్బవరం క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తారు. అలాంటి సమయంలోనే ఒక ధనవంతుడు కూతురుతో కిరణ్ కి పరిచయం ఏర్పడుతుంది. దీంతో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి తన తండ్రితోనే గొడవ పడతారు. చివరికి ఆ అమ్మాయి దక్కిందా లేదా అనే విషయమే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం నటనే ఈ సినిమాకి హైలైట్ గా ఉందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక బాబా భాస్కర్ నటన కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ గా నిలిచింది. ముఖ్యంగా పంచ్ డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పర్వాలేదనిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: