లైగర్ ను దింపేసిన గెటప్ శ్రీను.. భలే నవ్వించాడు?

praveen
గెటప్ శ్రీను.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు . ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.. ప్రతి స్కిట్ లో ఏదో ఒక డిఫరెంట్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొడుతు ఉంటాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే తన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ మెప్పిస్తూ ఉంటాడు అని గెటప్ శీను. అతను ఏ గెటప్ వేసిన కూడా అందులో పరకాయప్రవేశం చేసి మరి అదరగొడుతూ ఉంటాడు.

 అందుకేనేమో శ్రీను కాస్త ప్రేక్షకులకు గెటప్ శ్రీను గా మారిపోయాడు.. ఇకపోతే జబర్దస్త్ లో భాగంగా గెటప్ శ్రీను ఎప్పుడూ ఏదో ఒక కొత్త గెటప్లో అలరిస్తు ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు సినిమా లోని హీరోల పాత్రలను కూడా చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కాగా ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో భాగంగా మరోసారి అదిరిపోయే గెటప్ వేశాడు శ్రీను. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలోని గెటప్ వేసి అదరగొట్టాడు. విజయ్ దేవరకొండ వాయిస్ ని అచ్చుగుద్దినట్టు దింపి.. విజయ్ ఆటిట్యూడ్ చూపించేందుకు ప్రయత్నించాడు.

 ఈ క్రమంలోనే కామెడీ పంచ్ లతో కడుపుబ్బ నవ్వించాడు అని చెప్పాలి. ఇకపోతే లైగర్ సినిమాతో గెటప్ శ్రీను  కి ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. సినిమాల్లో నటించడమే కాదు ఇప్పుడు జబర్దస్త్ లో విజయ్ దేవరకొండ లైగర్ గెటప్ వేసి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: