'నేనే వస్తున్నా' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న ధనుష్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే ఈ సంవత్సరం తిరు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలాగే తిరు మూవీ దాదాపు 100 కోట్ల కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే తిరు మూవీ తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న ధనుష్  తాజాగా నానే వ‌రువేన్ అనే తమిళ మూవీ లో నటించాడు. 
సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కున ఈ మూవీ ని క‌లైపులి ఎస్‌థాను నిర్మించారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగు లో ఈ మూవీ ని నేనే వస్తున్నా అనే పేరుతో విడుదల చేయనున్నారు.
 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. సెల్వరాఘవన్ ,  ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగో మూవీ కావడంతో ఈ మూవీ పై కోలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతే కాకుండా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ మూవీ ని చాలా బాగా తీసినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తుండటంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ మూవీ పై మంచి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం తిరు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న ధనుష్ :నేనే వస్తున్నా' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: