ట్రైలర్: అదరగొడుతున్న ముత్తు ట్రైలర్..!!

Divya
హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం విందు తనందు కాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తేరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా మొదటి భాగం ద లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో స్రవంతి మూవీస్ అధినేత రవి కిషోర్ విడుదల చేయబోతున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారు. అయితే అనివార్య కారణాలవల్ల తెలుగులో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 17న విడుదలబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించడం జరిగింది.

తెలుగులో విడుదల ఆలస్యానికి కారణం అనుకున్న సమయానికి డబ్బింగ్ ,రీ రికార్డింగ్ పనులు ఆలస్యం కావడమే అన్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో హీరోయిన్ గా సిద్ధి  నటిస్తున్నది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. నటి రమ్యకృష్ణ ఈ సినిమా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. ఇక సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. కొన్నిసార్లు నిజం చెప్పడం కథ అల్లడం అంటే కష్టం అన్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.
ఒక సాధారణ యువకుడు విధివీడిన నాటకంలో గ్యాంగ్ స్టార్ గా మారిన చిత్రకదాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఈ చిత్రంలో హీరో శింబు ఇందులో ఎన్నో పాత్రలలో కనిపించబోతున్నట్లు ఈ ట్రైలర్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఉద్వంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో శింబు ఒక పల్లెటూరు యువకుడిగా గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. మరి చిత్రంతోనైనా హీరో శింబు మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: