ఈ వయసులో కూడా హీటెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

Divya
ఇక హీరోయిన్లు సైతం కాస్త స్టార్డం వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో జనాలను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే యువతరం హీరోయిన్ల కంటే ముందు వచ్చిన వారు ఎప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఉండడం జరుగుతోంది. కేవలం గ్లామరస్ అందాలతో ఫాలోవర్స్ ను ప్రతిరోజు పెంచుకుంటూ వయసుకు ఏమాత్రం సంబంధం లేకుండా తమ గ్లామర్ చూపిస్తూ ఉన్నారు. ఇక అలాంటి హీరోయిన్లలో ఒకప్పటి హీరోయిన్ అమీషా పటేల్ కూడా చేరిందని చెప్పవచ్చు. ఈమె పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది.


ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అయిపోయిందని చెప్పవచ్చు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన బద్రి సినిమాలో రేణు దేశాయ్ తో ఈమె స్క్రీన్ ని షేర్ చేసుకున్నది. ఆ తర్వాత ఈమె కెరియర్ తెలుగులో అంతగా సాఫీగా సాగలేదు కానీ బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. అయితే బాలీవుడ్లో కొద్ది రోజులు మాత్రం తన హవాని కొనసాగించి బాగానే నిలదొక్కుతోంది అమేషా పటేల్.

ఇక మహేష్ బాబు తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు వంటి సినిమాలను నటించింది. కానీ ఈ సినిమాలు భారీ డిజాస్టర్ ని చవిచూశాయి. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా తన ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే తన బికినీ అందాలతో ఈ ముద్దుగుమ్మ అందాలను ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం ఈమె వయసు 46 సంవత్సరాలు అంటే నమ్మశక్యంగా కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: