సిపీఐ నేత నారాయణకు పరోక్షంగా కౌంటర్ వేసిన నాగార్జున..!!

murali krishna
బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై తీవ్రస్థాయిలో పలు విమర్శలు ఎదురవుతున్న విషయం మనకు బాగా తెలిసిందే. అయితే గత సీజన్లో నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం పట్ల సీపీఐ నేత అయిన నారాయణ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నటుడు నాగార్జున పట్ల కూడా దారుణమైన విమర్శలు చేస్తున్నారు.


ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఏం తెలియజేయబోతున్నారు అంటూ ఈయన పెద్ద ఎత్తున  అయితే మండిపడ్డారు.


ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏంటి ఇదంతా డబ్బు కోసమే.డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నారాయణ నాగార్జున గురించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. సాధారణంగా నాగార్జున ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ నారాయణ చేస్తున్నటువంటి విమర్శలు రోజురోజుకు హద్దులు దాటుతుండడంతో ఏకంగా బిగ్ బాస్ వేదికపైనే నాగార్జున తన స్టైల్లో నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట.


అసలేం జరిగింది అనే విషయానికి వస్తే ప్రతి శని ఆదివారాలలో నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్లో భాగంగా కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మెరీనా రోహిత్ విషయంపై మాట్లాడుతూ… రోహిత్ మేరీనాని కాస్త బాగు చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ కూడా నాగార్జున తెలిపారు.


మీకు లైసెన్స్ ఉంది మీరిద్దరూ భార్యాభర్తలు మీరు ఇద్దరు హగ్ చేసుకోవడంలో తప్పులేదని చెబుతూనే నారాయణ.. నారాయణ అంటూ కౌంటర్ కూడా వేశారు. ఇలా వీరిద్దరూ భార్యాభర్తలని వీరిద్దరూ హగ్ చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా నాగార్జున సీపీఐ నేత నారాయణకు కౌంటర్ ఇచ్చారట..గత సీజన్లో షణ్ముఖ్ జస్వంత్ సిరి తరచూ హగ్ చేసుకోవడం వల్లే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లి వెత్తాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నాగార్జున వీరికి లైసెన్స్ ఉందంటూ పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: