బుల్లితెర కామెడీ స్టార్స్ గెటప్ శీను, రామ్ ప్రసాద్ రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా?

murali krishna
జబర్దస్త్ కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ టీమ్ వెరీ స్పెషల్. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కూడిన ఈ టీమ్ ఏళ్ల తరబడి అద్భుతాలు చేస్తున్నారు .
అటువంటి ఈ ముగ్గురు మిత్రులు కలిస్తే నాన్ స్టాప్గా నవ్వులే నవ్వులే. శ్రీను గెటప్స్, రామ్ ప్రసాద్ ఆటో పంచెస్, సుధీర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు నవ్వులు పుట్టిస్తాయి . రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను టాలెంట్స్ కి సపరేట్ గా టీమ్ ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లు వచ్చాయి. ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకం… స్నేహం కారణంగా ముగ్గురు విడిపోయే ప్రయత్నం చేయలేదు. అసలు ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా కూడా కామెడీ పండించగల గల చాకచక్యం వారికే సొంతం.
అయితే కొన్నాళ్ల క్రితం ఈ టీమ్ విడిపోయింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ వదిలేశారు. దీంతో సుడిగాలి సుధీర్ టీమ్ పేరుపై రామ్ ప్రసాద్ కొత్తవారితో స్కిట్స్ చేస్తున్నాడు. కాగా ఇటీవల గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే . రామ్ ప్రసాద్ కి కొంత మేర తోడు దొరికింది. నటుడుగా భారీగా సంపాదిస్తున్న గెటప్ శ్రీను జబర్దస్త్ కి ఎందుకు తిరిగి వచ్చారనే అనుమానాలు ప్రేక్షకుల్లో వస్తున్నాయి . అదే సమయంలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువ అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. దీని గురించి విచారణ చేయగా గెటప్ శ్రీను కంటే రామ్ ప్రసాద్ అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలిసింది.
రామ్ ప్రసాద్ నటుడే కాదు, రైటర్ కూడాను. సుడిగాలి సుధీర్ టీమ్ కి అవసరమైన స్క్రిప్ట్స్ రాసేది రామ్ ప్రసాదే. అలాగే ఇతర టీమ్స్ కూడా స్క్రిప్ట్స్ అందిస్తారు. ఆ విధంగా ఆయనకు చాలా డిమాండ్ ఉంది. రామ్ ప్రసాద్ ఒక కాల్ షీట్ కి లక్షన్నర వరకు తీసుకుంటున్నరాని సమాచారం . ఇక గెటప్ శ్రీను కాల్ షీట్ కి లక్ష రూపాయలు తీసుకుంటున్నారట. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రామ్ ప్రసాద్ చేస్తున్నారు. ఆ షో ద్వారా మరింత సంపాదన రామ్ ప్రసాద్ పొందుతున్నారు . అయితే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సినిమా అవకాశాలతో అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
సుడిగాలి సుధీర్ పూర్తిగా ఈటీవికి దూరమయ్యారు. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయాడు. సుధీర్ ఇతర ఛానల్స్ లో చేస్తున్నారు. ఇక రామ్ ప్రసాద్ ఈటీవీనే నమ్ముకొని ఉన్నారు. ఇక గెటప్ శ్రీను జబర్దస్త్ మాత్రమే చేస్తున్నారు. చాలా తక్కువ స్థాయి నుండి ఈ ముగ్గురు కమెడియన్స్ బుల్లితెర స్టార్స్ గా ఎదిగారు. సుధీర్, గెటప్ శ్రీను హీరోలు కూడా సినిమాలు చేస్తున్నారు. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో ఓ మూవీ చేయడం గమనార్హం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: