వరుస హిట్లతో దూసుకుపోతున్న అలియా భట్..!!

murali krishna
బాలీవుడ్ లో సరైన హిట్టు పడక పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తలలుపట్టుకుంటున్నారు. కానీ అలియాభట్ సుడి మాత్రం మాములుగా అయితే లేదు. నెపోటిజం కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆమెని ట్రోల్ చేసినా..


వరుస సక్సెస్ లు ఆమెని వరిస్తున్నాయి.ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది అలియా. కెరీర్ ఆరంభంలోనే 'హైవే', 'ఉడ్తా పంజాబ్' వంటి సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకుంది.


ఇక 'రాజీ' లాంటి సినిమాల్లో ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. గత కొంతకాలంగా ఆమెకి ప్లాప్ సినిమాలొస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'కళంక్' సినిమా కూడా డిజాస్టర్ అయింది. 'సడక్ 2' కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2'లో అలియా చేసిన స్పెషల్ సాంగ్ కూడా వర్కవుట్ అయితే కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఆమెకి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పవచ్చు.. 'గంగూభాయ్ కథియావాడి' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది అలియా.


'ఆర్ఆర్ఆర్'తో మరో హిట్టు ఆమె ఖాతాలో పడింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువే అయినప్పటి కీ.. తన నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు రణబీర్ తో కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా కూడా హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే ఏడాదిలో మూడు హిట్స్ ఆమె వచ్చినట్లే. వీటి తో పాటు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'డార్లింగ్స్' సినిమాకి కూడా భారీ వ్యూస్ వచ్చాయి.


ఇంత తక్కువ గ్యాప్ లో మూడు హిట్లు కొట్టడం మాములు విషయం అయితే కాదు. హీరోల కు కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి సక్సెస్ అయితే రాలేదు. దీంతో ఇప్పుడు అలియా నటిస్తోన్న 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: