బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన 'ఎఫ్ 3' మూవీ..!

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరో లుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ఎఫ్ 2 మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ ,  వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా ,  మెహరీన్ హీరోయిన్ లుగా దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసింది. ఎఫ్ 3 మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఎఫ్ 3 మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

అలా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఎఫ్ 3 మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయ్యింది. ఎఫ్ 3 మూవీ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఇప్పటికే జీ తెలుగు ఛానల్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా జీ తెలుగు లో వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా , రాజేంద్ర ప్రసాద్ ,  సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: