బిగ్ బాస్ 6 : ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా?

praveen
తెలుగు బుల్లితెర  ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 21 మంది పోటీదారులు తమ గేమ్ ప్లాన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం కూడా గడవ లేదు అప్పటికే వాళ్ళ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు అని చెప్పాలి. మొదటి వారమే హౌస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియ అయితే వాడి వేడి గా జరిగింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పుడూ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఏ వారం ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఎంత హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుందో..  ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది కూడా అంతే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా కొనసాగుతున్న సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోల్చిచూస్తే రేవంత్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. వారానికి 60 వేల రూపాయలు పారితోషికం అందుకుంటున్నాడట. కాగా రేవంతు తర్వాత యూట్యూబర్ శ్రీహన్ వారానికి 50 వేలు అందుకుంటున్నాడు. చలాకి చంటి కూడా 50000 పారితోషికం తీసుకుంటూ ఉండడం  గమనార్హం. బుల్లితెర నటుడు మోడల్ రోహిత్ 45 వేలు, బాలాదిత్య వారానికి 45 వేల రూపాయలు అందుకుంటున్నారట. అందరిలోకెల్లా రేవంత్ రెమ్యూనరేషన్  విషయంలో టాప్ లో ఉన్నాడు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: