ఈవారం థియేటర్లో విడుదలకు రెడీగా ఉన్నా సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ వారం కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదలకు కావడానికి రెడీ గా ఉన్నాయి. ఆ సినిమాల వివరాలను తెలుసు కుందాం. ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నిలబడి ఉన్నాయి. రెజీనా కసాండ్రా , నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తలకెక్కిన శాకిని డాకినీ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాడే దర్శకత్వంలో తెరకెక్కిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా ,  ప్రముఖ కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించ బోతున్నాడు.

బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా నటించిన సకల గులాబీ రామ సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. నేను కేర్ ఆఫ్ నువ్వు సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. కిచ్చ సుదీప్ హీరోగా నటించిన కే 3 కోటికొక్కడు మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాపుతుంది. ఇలా ఈ వారం విడుదల కాబోయే మూవీ లలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ,  షాకిని డాకిని , నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ లపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: