హీరోయిన్ సిమ్రాన్ గురించి.. కొంతమందికి మాత్రమే తెలిసిన విషయాలు?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది సిమ్రాన్. స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇప్పుడు  సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

 ఇకపోతే 1979 లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది సిమ్రాన్. ఈమెది పంజాబీ కుటుంబం కావడం గమనార్హం. ఈమెకి మోనాల్, జ్యోతి అనే ఇద్దరు సోదరీమణులు, సుమిత్ అనే సోదరుడు ఉన్నారు. 2002లో సిమ్రాన్ తన పెద్ద చెల్లి మోనాల్ ను కోల్పోయింది. ముంబై లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది సిమ్రాన్. 2003లో చిన్ననాటి స్నేహితుడు అయిన దీపక్ బగ్గాను వివాహం చేసుకుంది. వీరికి ఆది, ఆదిత్య అనే ఇద్దరు కుమారులు కూడా ఉండడం గమనార్హం.  అప్పట్లో దూరదర్శన్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన ముకబుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

 తద్వారా సనం హర్ జాయ్ అనే హిందీ చిత్రంలో సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయినా సిమ్రాన్  తర్వాత తేరే మేరే సప్నే అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరై మంచి గుర్తింపు సంపాదించుకుంది. శరత్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అబ్బాయిగారి పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇంద్రప్రస్తం  అనే సినిమాతో మలయాళ సినిమా లోకి అడుగు పెట్టింది.. తెలుగు తమిళ్ లో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించింది సిమ్రాన్. ఇక వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది అని చెప్పాలి.  భర్తకు ఉన్న ప్రొడక్షన్ హౌస్ చూసుకుంటూ జీవనం సాగిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: