శర్వానంద్ ను రక్షించబోతున్న మౌత్ టాక్ !

Seetha Sailaja
సెన్సిబుల్ హీరో శర్వానంద్ మంచి నటుడు ఎలాంటి పాత్ర అయినా నటించి మెప్పించగలడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వరస పరాజయాలు అతడిని వెంటాడుతున్నాయి. కమర్షియల్ హీరోగా మారాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు వర్కౌట్ కావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఏకంగా బుక్ మై షో 95% రేటింగ్ ఇచ్చే స్థాయిలో ఈమూవీ నిలబడటంతో మారిన ప్రేక్షకుల అభిరుచి మరొకసారి నిరూపించింది.

ఈమూవీతో విడుదలై భారీ అంచనాలు ఉన్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీని స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి ప్రమోట్ చేసినప్పటికీ ఆమూవీ కంటే సగటు ప్రేక్షకుడు ‘ఒకే ఒక జీవితం’ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం షాకింగ్ గా మారింది. ‘బ్రహ్మాస్త్ర’ మూవీ బడ్జెట్ తో పోల్చుకుంటే ‘ఒకే ఒక జీవితం’ సినిమా బడ్జెట్ కనీసం 5శాతం కూడ ఉండడు. అయినా మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే ఈమూవీ చాల స్లోగా ఉండటంతో పాటు ఈమూవీ కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు ‘సీతారామం’ ‘కార్తికేయ 2’ సినిమాలను చూసినంత మ్యానియాతో శర్వానంద్ సినిమాను ఆదరిస్తారా అన్నసందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు శర్వానంద్ నటన గురించి అదేవిధంగా అమల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈమూవీ సమర్థుడైన దర్శకుడు చేతిలో పడి ఉంటే శర్వానంద్ కోరుకునే సూపర్ హిట్ వచ్చి ఉండేది.

ఈమూవీకి పోటీగా మరికొన్ని చిన్న సినిమాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా అత్యంత భారీ గ్రాఫిక్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విడుదల అయినప్పటికీ జనం కేవలం ‘ఒకే ఒక జీవితం’ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉండటంతో ఒక విధంగా శర్వానంద్ కు సక్సస్ వచ్చినట్లే అనుకోవాలి. అయితే ఈమూవీ కమర్షియల్ గా ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్న సందేహాలు ఉన్నప్పటికీ శర్వానంద్ కు మరొకసారి బ్రేక్ వచ్చింది అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: