కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా..?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా మీద రామ్ చరణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలావుంటే యువి క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్  16వ సినిమా

 గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఉండబోతుందని గత ఏడాది అధికారికంగా ప్రకటించింది.
 ఈ మధ్యకాలంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని వార్తలు వస్తున్నాయి, ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు, కానీ రామ్ చరణ్  ఇప్పుడు ఒక కన్నడ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.ఇక ఆ డైరెక్టర్ మరెవరో కాదు కన్నడ నాట మఫ్టీ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న నారదన్.అయితే ప్రశాంత్ నీల్ దగ్గర ఉగ్రం అనే సినిమాకు నారదన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత ఆయన స్వయంగా మఫ్టీ అనే సినిమా తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే రామ్ చరణ్ తేజ్ తో సన్నిహిత్య సంబంధం ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్ తన శిష్యుడు రామ్ చరణ్ తో సిట్టింగ్ ఏర్పాటు చేశాడని, ఇప్పటికే కథ విన్న రామ్ చరణ్ తేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇదిలావుంటే ఇక యూవీ క్రియేషన్స్ సంస్థలో రూపొందుతుందా లేక మరి ఏదైనా మరో ప్రొడక్షన్ హౌస్ ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే కన్నడ దర్శకుడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు, కన్నడ భాషలో అయితే సినిమా విడుదలవుతుంది. కాగా మిగతా మూడు భాషల్లో కూడా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: