రేణు దేశాయ్ కామెంట్స్ లో ఆంతర్యం !

Seetha Sailaja
గతకొంత కాలంగా రేణు దేశాయ్ మౌనంగా ఉంటోంది. దీనితో ఆమెకు ఏమైంది అంటూ కొందరు ఆశ్చర్యపోయారు. మౌనం వీడిన ఆమె ప్రస్తుతం తన పిల్లలు అకిరా నందన్ ఆద్య లతో కలిసి స్కాట్లాండ్ లో అక్కడ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోంది. తన పిల్లలు ఈ హాలిడే ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మధ్యలో ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి.

ప్రతి వ్యక్తికి తన జీవితానికి తోడుగా ఉండే ఒక సోల్ మేట్ అవసరం అని చెపుతూ ‘మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి' అంటూ కామెంట్స్ పెట్టింది. దీనితో కొందరు ఆమె కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. రేణు దేశాయ్ మళ్ళీ తోడును కావాలని అనుకుంటోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆమధ్య రేణు దేశాయ్ కు 2018లో ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అన్న వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పవన్ అభిమానుల దగ్గర నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. దీనితో ఆమె పెళ్ళి ఆలోచనలు ఆగిపోయాయి అని అంటారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చానాళ్ళ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది.

అదేవిధంగా ‘ఆద్య’ అనే లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. అయితే టైగర్ నాగేశ్వరావు ఫలితాన్ని పట్టి ఆమె కెరియర్ మళ్ళీ ప్రారంభం అవుతుందా లేదా అన్న విషయం తేలుతుంది. ఆమధ్య ఒక రియాలిటీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈమధ్య కామెంట్స్ కు దూరంగా ఉంటున్న రేణు మళ్ళీ ఇలా భావయుక్తంగా కామెంట్స్ చేయడంతో ఆమె ఆలోచనలలో మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చాయా అంటూ చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: