విజయ్ నేను కష్టాల్లో ఉంటే ఒక్క పైసా ఇవ్వలేదు: పూరి

Purushottham Vinay
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్.టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డ్ కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందంటూ కొందరు కామెంట్ చేశారు.సీన్ కట్ చేస్తే షేక్ కాదు కదా షాక్ కూడా ఇవ్వలేదు అంటు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకోనున్న పూరి, చార్మి.. నిలువునా మునిగిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాదాపు 20 ఏళ్ళు సంపాదించుకున్న డబ్బు అంతా ఛార్మీ ఈ సినిమా పై నే పెట్టి.. కోట్ల నష్టం వచ్చింది అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే చలించిపోయిన విజయ్ దేవరకొండ.. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసాడని న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.



సినిమా అనుకోని విధంగా ఫ్లాప్ కావడంతో హర్ట్ అయిన విజయ్ దేవరకొండ తనకు తగ్గ సహాయం చేయాలని చెప్పి సినిమాకి తీసుకున్న ఆరు కోట రెమ్యూనరేషన్ ని మొత్తం వెనక్కి ఇచ్చేసాడట. ఇదే న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే ఇదే విషయాన్ని పూరీ దగ్గర ప్రస్తావించిన ఆయన స్నేహితుడికి పూరి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడట. ' ఎవరు నీకు చెప్పింది విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసాడని ..ఇప్పటివరకు నాకు విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ..అసలు సినిమాకి సంబంధించిన ఫెయిల్యూర్ గురించి కూడా మాట్లాడలేదు ' అని పూరీ అన్నాడట. దీంతో ఈ విషయం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి విజయ్ బంగారం,కత్తి, తోఫు, తురుము అనుకున్నా అభిమానులంతా కనీసం పూరి జగన్నాథ్ ఇంత ఇబ్బందుల్లో ఉంటే సగం కూడా ఇవ్వలేకపోయావా అంటూ కామెంట్ చేస్తున్నారు, మరి చూడాలి ఈ ఇబ్బందుల నుండి పూరి జగన్నాథ్ ఎలా సేఫ్ అవుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: