మరోసారి అక్కడ రీ రిలీజ్ కానున్న జల్సా '4 కే' వర్షన్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన విజయవంతమైన మూవీ లలో జల్సా సినిమా ఒకటి. జల్సా మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ,  ఇలియానా ,  పార్వతి మెల్టన్ , కమిలిని ముఖర్జీ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన జల్సా మూవీ అప్పట్లో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచి కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇలా ఆ రోజుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఆయన సెప్టెంబర్ 2 వ తేదీ కంటే ఒక రోజు ముందుగా ఈ సినిమాను 4 కే వర్షన్ లో  చాలా ప్రాంతాలలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి అదిరి పోయే రికార్డ్ లను సాధించింది.

ఇది ఇలా ఉంటే జల్సా 4 కే వర్షన్ ని మరో సారి విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సారి జల్సా 4 కే వర్షన్ ని యూ కే లో సెప్టెంబర్ 8 వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  అలాగే యూ కే లో  రీ రిలీజ్ కాబోతున్న మొదటి తెలుగు సహా ఇండియన్ సినిమా కూడా ఇదే అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి యూకే లో జల్సా 4 ర్ కే వర్షన్ కి  ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: