బిగ్ బాస్ 6 : ఈవారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

shami
బిగ్ బాస్ సీజన్ 6 లో అసలు యుద్ధం మొదలైంది. మండే జరగాల్సిన నామినేషన్ ప్రక్రియ బుధవారం వరకు పొడించారు. నిన్నటి వరకు జరిగిన క్లాస్, ట్రాష్, మాస్ టాస్క్ ముగించిన బిగ్ బాస్.. నేడు మాస్ లో ఉన్న హౌజ్ మెట్స్ లో ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారి పేర్లు పేపర్ పై ఉంచి దాన్ని ఫ్లష్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్ లో జరిగిన మొదటి నామినేషన్స్ లో అంతా హాట్ హాట్ వాతావరణమే ఉందని చెప్పొచ్చు.
ముఖ్యంగా సింగర్ రేవంత్ ని కొందరు హౌజ్ మెట్స్ అతని వాయిస్ మరీ బాగా డామినేట్ చేస్తుందని అన్నారు. అందుకే ఈ నామినేషన్స్ లో అతనికి 8 ఓట్లు పడ్డాయి. ఇక రేవంత్ తో పాటుగా ఈ సీజన్ మొదటి వారం నామినేషన్స్ లో చలాఇ చంటి, శ్రీ సత్య, ఫైమా, ఇనయా, అభినయ శ్రీ, అరోహి  ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం 7 సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవుతారో చూడాలి.
బిగ్ బాస్ సీజన్ మొదలైంది అంటే బుల్లితెర ఆడియెన్స్ కి పండుగ మొదలైనట్టే లెక్క. మండే టు ఫ్రై డే రాత్రి 10 గంటలకు.. శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వస్తాడు కాబట్టి రాత్రి 9 గంటలకు షో వస్తుంది. అయితే ఈ సీజన్ డిస్నీ హాట్ స్టార్ లో 24/7 లైవ్ కూడా ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కంటెంట్ ఫుల్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు బిగ్ బాస్ టీం. ప్రత్యేకంగా ఈ సీజన్ చాలా స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేశారట. సీజన్ 6 మొదటి వారం ఎంతమంది ఓటింగ్ వేస్తారన్నది నాగార్జున చెబితేనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: