ఒకే డ్రెస్ లో సామ్, కీర్తి.. ఎవరు హాట్ గురూ?

Purushottham Vinay
స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో సమంత, కీర్తి సురేష్ లకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అటు గ్లామరస్ రోల్స్ లో నటించినా ఇటు అభినయ ప్రధాన పాత్రల్లో నటించినా సమంత, కీర్తి సురేష్ తమ నటనతో మెప్పిస్తారు.సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు నిజ జీవితంలో మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. మహానటి సినిమాలో నటించడం వల్ల సమంత, కీర్తి సురేష్ మరింత క్లోజ్ అయ్యారు.పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు పాజిటివ్ గా చెప్పుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అటు కీర్తి సురేష్ ఇటు సమంత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ల ద్వారా కూడా సత్తా చాటారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కీర్తి సురేష్ లలో అందగత్తె ఎవరంటూ ఆసక్తికర చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం.


అటు సమంత ఇటు కీర్తి సురేష్ ఒకే టైప్ డ్రెస్ లలో కనిపించడం ఈ చర్చకు కారణమైంది.సమంత కొన్నిరోజుల క్రితం షీర్ సైడ్స్ ఉన్న గ్రే డ్రెస్ లో కనిపించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే కీర్తి సురేష్ కూడా అదే తరహా డ్రెస్ లో మెరిశారు. ఇద్దరు హీరోయిన్లు దాదాపుగా ఒకేలా ఉండే డ్రెస్ లు ధరించడం అరుదుగా మాత్రమే జరుగుతుందనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, సమంత ఫోటోలను పక్కపక్కనే పెట్టి నెటిజన్లు ఆ డ్రెస్ ఎవరికి బాగుందనే చర్చకు తెరలేపుతూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.సమంత ఫ్యాన్స్ సామ్ కే డ్రెస్ బాగుందని చెబుతుంటే కీర్తి సురేష్ అభిమానులు కీర్తికే డ్రెస్ బాగుందని చెబుతుండటం గమనార్హం. మ్యూచువల్ ఫ్యాన్స్ కొందరు ఇద్దరు హీరోయిన్లు అందంగా ఉన్నారని అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు హాట్ గా వున్నారో మీ అభిప్రాయం చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: