ఇటు శర్వానంద్ కి అటు రీతూ వర్మ కి కీలకంగా మారిన ఒకే ఒక జీవితం మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినా శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , ప్రియదర్శి ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ మూవీ కి శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే శర్వానంద్ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినా శతమానం భవతి మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లలో శర్వానంద్ హీరోగా నటించినప్పటికీ ఏ మూవీ లు కూడా ఈ హీరో కు చెప్పుకో దగ్గ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోయే ఒకే ఒక జీవితం సినిమాతో అయినా శర్వానంద్ మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

ఇది ఇలా ఉంటే రీతూ వర్మ కూడా కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కాక పోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మకు కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయం దక్కలేదు. ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది.  మరి ఒకే ఒక జీవితం మూవీ తో ఈ ముద్దు గుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇలా ఒకే ఒక జీవితం మూవీ విజయం ఇటు శర్వానంద్ కి అటు రీతూ వర్మకు కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: