సైలెంట్ గా సినిమాని పూర్తిచేసిన రానా సోదరుడు..!!

Divya
ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ హీరోగా మొదటి సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక ఆ చిత్రమే ఆ హింస.. ఈ చిత్రన్ని టాలీవుడ్ డైరెక్టర్.. తేజ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా తెలుపలేదు చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా చిత్రముందు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులను కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం.

అహింస ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈనెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అహింస  నుంచి మరొక ఆసక్తికరమైన పోస్టర్ని విడుదల చేశారు అందులో అభిరామ్ ముఖానికి ఒక గోనసంచెను కట్టి అతని చేతులను వెనుకల కట్టివేయడం వంటివి ఈ పోస్టర్ లో మనం చూడవచ్చు. ఫుల్ ఫేస్ కనిపించకపోయినప్పటికీ.. అభిరామ్ ముఖం నుంచి రక్తం కారడాన్ని మనం గమనించవచ్చు ఈ పోస్టర్ తేజ మార్కును మనకు గుర్తు చేసేలా కనిపిస్తోంది.
అహింస అనేది ఒక యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీ సినిమాగా అన్నట్లుగా సమాచారం. ఆర్పి పట్నాయక్ ఈ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ను అందిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ గా ఈ సినిమాకి నిర్వహిస్తున్నారు. అహింస ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను సైతం పరిచయం చేసిన తేజ ఇప్పుడు దగ్గుబాటి వారసుడు అభిరాముని ఎలా చూపిస్తాడు అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమా నులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: