వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ఆరోజు సందడి చేయనున్న 'విక్రమ్' మూవీ..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడు పాత్రలో నటించగా ,  మలయాళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు అయినటు వంటి ఫహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.

అలాగే తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో నటించాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. హేమ హేమీలు అయినా నటీనటులు ఈ మూవీ లో నటించడం ,  మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన తమిళ , తెలుగు , మలయాళ ,  కన్నడ , హిందీ భాషల్లో విడుదల అయిన విక్రమ్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకున్న విక్రమ్ మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర  ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ సెప్టెంబర్ 11 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు స్టార్ మా చానల్లో ప్రసారం కానుంది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: