నాటి హరికృష్ణ ఫోన్ కాల్ తో యూటర్న్ తీసుకున్న జూనియర్ అదృష్టం !

Seetha Sailaja
జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడుగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ‘బాలరామాయణం’ సినిమాలలో నటించినప్పటికీ రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతడికి సరైన గుర్తింపు రాలేదు. ఆతరువాత కొంత గ్యాప్ తో అతడు నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ దశ తిరిగింది. ఈ సినిమాను అప్పట్లో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించాడు.

రాజమౌళి జూనియర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్. అయితే ఆసినిమాలో హీరోగా అశ్వినీదత్ జూనియర్ గురించి ఆలోచన చేయలేదట. అశ్వనీ దత్ మనసులో ప్రభాస్ ను ఆమూవీకి హీరోగా తీసుకోవాలని అప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడట. అయితే ఒకరోజు జూనియర్ తండ్రి హరికృష్ణ తనకు ఫోన్ చేసి అడగడంతో ‘స్టూడెంట్ నెంబర్ 1’ మూవీకి హీరోగా జూనియర్ ఎంపిక అయ్యాడట.

అప్పటి విషయాలను అశ్వినీ దత్ గుర్తుచేసుకుంటూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాలను బయటపెట్టాడు. ఆసినిమా జూనియర్ కు రాకుండా ఉండి ఉంటే తారక్ ఇప్పటి టాప్ పొజిషన్ కు వచ్చి ఉండేవాడ లేదా అన్నది సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తారక్ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది అనుకోవాలి. ఒకప్పుడు టాప్ హీరోలు అందరితోను సినిమాలు తీసిన అశ్వనీ దత్ బాధ్యతను ఆయన కూతురు స్వప్నా దత్ తీసుకోవడమే కాకుండా వరస హిట్లతో దూసుకుపోతోంది.

‘మహానటి’ మూవీతో తిరిగి వైజయంతీ మూవీస్ కు మంచి రోజులు తీసుకువచ్చిన స్వప్న లేటెస్ట్ గా తీసిన ‘సీతా రామం’ ఘన విజయం సాధించడంతో వైజయంతీ సంస్థ మంచి జోష్ లో ఉంది. అయితే ‘సీతారామం’ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు అని తెలుస్తోంది. దీనితో ప్రేమ కథలను విపరీతంగా ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకులకు ఈసినిమా ఎందుకు నచ్చలేదు అన్నది ఎవరికీ అర్థంకాని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: