మళ్లీ అలాంటి పాత్రలో సమంత భయపెట్టిస్తుందా..!!

Divya
స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం బాలీవుడ్ వైపు కూడా సినిమాలలో నటించేందుకు సన్నహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్లో యువ హీరో వరణ్ ధావన్ తో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ సమంత నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా మొదటిసారిగా హిందీ సినిమా షూటింగులో కూడా నటించబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఒక హర్రర్ సినిమాలో పాల్గొనబోతోంది అన్నట్లుగా సమాచారం ఇందులో నటుడుగా ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నట్లు తెలుస్తోంది.


రాజస్థాన్ నేపథ్యంలో మరొక జానపద కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఇందులో సమంత రాజపుత్ యువరాణిగా.. ప్రేతాత్మ (దెయ్యం) గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సమంత గతంలో కూడా ఓంకార్ తెరకెక్కించిన రాజుగారు గది -2 చిత్రంలో కూడా ఈమె ఇలాగే నటించి మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు మరొకసారి మళ్లీ హర్రర్ జోనర్లో నటించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో భూల్ భూలయా -2 సినిమా విజయం కావడంతో ఈమెకు ఈ జోన్ సినిమాలు సక్సెస్ అవుతాయని భావిస్తోంది.

ఇక ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ జాబితాలో సమంత టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. ఫ్యామిలీ మెన్ సిరీస్-2  లో  సమంత రాజీ పాత్రలో తీవ్రవాదిగా నటించింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నటించింది. ఇప్పటికీ బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలలో నటించేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి గ్రాఫ్ తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. సమంత నాగచైతన్యత విడాకుల తర్వాత మరింత పాపులర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: