ఆహా 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్న 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ..!

Pulgam Srinivas
కుమారి 21 ఎఫ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుమారి 21 ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత హెబ్బ పటేల్ అనేక మూవీ లలో అవకాశాలను దక్కించుకుంది. కాక పోతే కుమారి 21 ఎఫ్ మూవీ రేంజ్ విజయాన్ని మాత్రం హెబ్బా పటేల్ బాక్సా ఫీస్ దగ్గర అందుకో లేక పోయింది. కొంత కాలం క్రితమే హెబ్బా పటేల్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ 'ఓదెల రైల్వే స్టేషన్' అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించింది.  ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీ లో వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలలో నటించారు. అశోక్‌ తేజ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ మరియు స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆహా  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఓదెల రైల్వే స్టేషన్ మూవీ వారం ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  రోజుల్లో మూడు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు ఆహా 'ఓ టి టి' సంస్థ అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఇలా ఆహా 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లో ఓదెల రైల్వే స్టేషన్ మూవీ అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకుల నుండి ఆదరణను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: