పవన్ కళ్యాణ్ 'జల్సా 4కే' వర్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో నటించిన అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో జల్సా మూవీ ఒకటి. 2008 వ సంవత్సరంలో విడుదల అయిన జల్సా మూవీ అప్పట్లో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచి కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ,  గోవా బ్యూటీ ఇలియానా , పార్వతి మెల్టన్ , కమలిని ముఖర్జీ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఇలా అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకున్న జల్సా మూవీ ని తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ఒక రోజు ముందుగా అనగా సెప్టెంబర్ 1 వ తేదీన ఈ మూవీ 4 కే వర్షన్ ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ 4 కే వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

 
నైజాం : 1.26 కోట్లు .
సీడెడ్ : 39 లక్షలు .
యూ ఏ : 26 లక్షలు .
ఈస్ట్ : 9 లక్షలు .
వెస్ట్ : 14 లక్షలు .
గుంటూర్ : 11 లక్షలు .
కృష్ణ : 22 లక్షలు .
నెల్లూర్ : 11 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జల్సా 4 కే వర్షన్ మూవీ 2.57 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  22 లక్షలు .
ఓవర్ సీస్ లో : 40 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా జల్సా 4 కే వర్షన్ మూవీ 3.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: